Healthhealth tips in teluguKitchen

ముక్కు దిబ్బడ, ముక్కు నుండి నీరు కారటం, సైనస్ వంటి సమస్యలు జీవితంలో ఉండవు

Nasal Congestion : ఈ సీజన్ లో గొంతుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. సాధారణంగా జలుబు చేసినప్పుడు అలాగే కొన్ని రకాల అలర్జీలు వలన ముక్కు దిబ్బడ, ముక్కు కారటం వంటి సమస్యలు వస్తాయి. ఈ చలికాలంలో అయితే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ సమస్య సైన‌స్ ఉన్న‌వారికి ఎప్పుడు ఉంటుంది. ముక్కులో మ్యూక‌స్‌, దుమ్ము, ధూళి పేరుకుపోయి అల‌ర్జీ కార‌ణంగా కూడా ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. ఇలాంటి స‌మ‌యంలో ముక్కు రంధ్రాలు రెండూ మూసుకుపోయి శ్వాస కూడా స‌రిగ్గా ఆడక చాలా ఇబ్బంది పడతారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
Hot Water Drinking Benefits in telugu
ఈ స‌మ‌స్య ఉన్న‌వారు నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. దీని నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయాలి. ముక్కుదిబ్బడతో బాధపడేవారు బాగా మరుగుతున్న నీటిలో ఐదు చుక్కలు పెప్పర్‌మెంట్‌ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఈ విధంగా ఆవిరి పట్టడం వల్ల ముక్కు రంధ్రాలు తెరుచుకొని ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

అలాగే ముక్కు కారే సమస్య కూడా తగ్గుతుంది. సోంపు నీరు, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి వాటిని .వేడిగా తాగటం వలన వాటిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముక్కు దిబ్బడ తగ్గించడానికి సహాయ పడుతాయి. ముక్కు దిబ్బ‌డ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు క‌ర్పూరం, వాము చాలా బాగా పనిచేస్తాయి. ఒక వస్త్రంలో ఒక స్పూన్ వాము, ఒక కర్పూరం బిళ్ళను పొడిగా చేసి వేసి ముడిలా చుట్టాలి.
karpuram benefits In Telugu
ఈ ముడిని ముక్కు ద‌గ్గ‌ర పెట్టుకుని కొద్ది కొద్దిగా వాస‌న పీలుస్తుండాలి. ఇలా చేస్తుంటే ముక్కు రంధ్రాలు ఫ్రీ అయ్యి ముక్కు దిబ్బ‌డ త‌గ్గి శ్వాస స‌రిగ్గా ఆడుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఈ చిట్కా పాటిస్తే వెంటనే మంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ చిట్కాను పాటించి సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.