గృహలక్ష్మి సీరియల్ నటి దివ్య ఎన్ని సీరియల్స్ లో నటించిందో?

Gruhalakshmi serial Divya : TV లో ఎన్నో రకాల సీరియల్స్ వస్తున్నాయి. తెలుగులో ఎన్నో సీరియల్స్ ఆడియన్స్ ఆదరణతో దూసుకెళ్తున్నాయి. తాజాగా గృహలక్ష్మి సీరియల్ కూడా మంచి ఆదరణతో నడుస్తోంది. గృహలక్ష్మి సీరియల్ మంచి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతుంది. తులసి, నందు లకు కూతురుగా చేస్తున్న దివ్య అసలు పేరు పూజితా రెడ్డి.

మార్చి 19న పుట్టిన పూజితా రెడ్డి అచ్చం మన తెలుగమ్మాయిలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో పాటు డాన్స్ పై కూడా మక్కువ ఉండడంతో భరతనాట్యం నేర్చుకుని స్టేజ్ షోస్ ఇచ్చింది. అవార్డు కూడా అందుకుంది. ఇక కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ముద్దుబిడ్డ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్టుగా కరుణ పాత్రలో మెప్పించింది.

ఈ టీవీలో కొన్ని సీరియల్స్ లో చేసిన పూజితా ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో చేస్తూ, ఆడియన్స్ ని మెప్పిస్తోంది. ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూ… మరో పక్క YOUTUBE చానల్ రన్ చేస్తూ సక్సెస్ గా ముందుకు సాగుతుంది.