15 రోజులు 2 స్పూన్స్ తింటే చాలు కీళ్ల మధ్య జిగురు,వశ్యత పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి
joint Pains Home Remedies In telugu : కీళ్ళనొప్పులతో బాధపడుతున్న వారికి ఈ చలికాలంలో నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. నొప్పుల నుండి ఉపశమనం కోసం ఆహారంలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోక పోవటం, ఎక్కువసేపు కూర్చోవటం,శారీరక శ్రమ తక్కువగా ఉండటం వంటి అనేక రకాల కారణాలతో 30 ఏళ్ళు వచ్చేసరికి కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి.
ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఒక బౌల్ లో మూడు స్పూన్ల ఆవిసె గింజలను తీసుకోవాలి. వీటిలో ఉండే మెగ్నీషియం, రాగి, మాంగనీస్, థయామిన్ మరియు ఫాస్పరస్ వంటివి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఆ తర్వాత మూడు స్పూన్ల తెల్లనువ్వులను వేయాలి.
తెల్ల నువ్వులలో పాల కంటే 7 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే ఇనుము, రాగి మరియు మాంగనీస్, విటమిన్ బి1 వంటివి సమృద్దిగా ఉంటాయి. ఆ తర్వాత మూడు స్పూన్ల గుమ్మడి గింజలను వేయాలి. వీటిలో విటమిన్లు బి, విటమిన్లు, ఎ, ఇ, సి సమృద్దిగా ఉంటాయి. అంతే కాకుండా ఎముకలు, చర్మం, కండరాల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ కె కూడా ఉంటుంది.
ఆ తర్వాత మూడు స్పూన్ల సన్ ఫ్లవర్ గింజలను వేయాలి. దీనిలో మెగ్నీషియం మరియు రాగి సమృద్దిగా ఉంటాయి. వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకొని ఒక బౌల్ లో పోసి, దానిలో తేనె కలపాలి. మిశ్రమం పొడిగా లేకుండా తేనె కలపాలి. తేనె శరీరంలో కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది.
ఈ మిశ్రమంను ఫ్రిజ్ లో పెడితే పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమంను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ముందు ఒక స్పూన్, మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 15 రోజుల పాటు తీసుకుంటే కీళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కీళ్ల మధ్య జిగురు,వశ్యత కూడా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.