ఈ గింజలను నానబెట్టి పరగడుపున తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు
Sabja Benefits In telugu : పూర్వ కాలంలో సబ్జా గింజలను చాలా విరివిగా వాడేవారు. మరల ఇప్పుడు మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా వాడటం ప్రారంభించారు. ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. చాలా చవకగా మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది.
ఈ మధ్య కాలంలో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. అలా ఈ సబ్జా గింజల వాడకం కూడా బాగా పెరిగింది. సంవత్సరం పొడవునా విరివిగా లభించే ఈ సబ్జా గింజలను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఒక స్పూన్ గింజలను రెండు గంటలు నీటిలో నానబెడితే గింజల పరిమాణం రెండింతలు అవుతుంది.
నీటిలో వేస్తె బాగా ఉబ్బుతాయి. నీటిలో సబ్జా గింజలు నానబెట్టడం వల్ల యాంటీఆక్సిడెంట్స్, ప్రయోజనకరమైన జీర్ణ ఎంజైమ్ లు పెరుగుతాయి. సబ్జా గింజలను తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. సబ్జా గింజలలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు నానిన సబ్జా గింజలను తింటూ ఆ నీటిని తాగితే 10 రోజుల్లోనే తేడా కనపడుతుంది.
అలాగే డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటంలో సహాయ పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. మూత్రపిండాలను ఫ్లష్ చేసి శరీరంలోని విషాలను బయటకు పంపుతాయి. సబ్జా గింజలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పి, వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి.
ఆర్థరైటిస్ వాపుల నుండి ఉపసమనం కోసం ఉపయోగిస్తారు. కీళ్ల నొప్పుల సమస్యతో బాధ పడుతున్న వారు సబ్జా గింజలను తింటే ఫలితం ఉంటుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో మనకు చాలా బాగా సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.