1 గ్లాసు తాగితే కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు,వశ్యత పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి
Joint Pains Juice Danimma : కీళ్ళనొప్పులు అనేవి చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కార్టిలేజ్ దెబ్బతిని జిగురు పదార్ధం ఉత్పత్తి తగ్గిపోవటం వలన కీళ్ల మధ్య గుజ్జు తగ్గటం, కీళ్ల నొప్పులు వంటివి చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవటం, ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
కార్టిలేజ్ దెబ్బ తినకుండా, జిగురు ఎక్కువ ఉత్పత్తి అవ్వాలన్నా, ఎముకల మధ్య గ్రీజ్ పెట్టినట్టు వశ్యత పెరగాలంటే కార్టిలేజ్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కార్టిలేజ్ ని కాపాడటానికి దానిమ్మ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానిమ్మలో ఉండే క్యూనిక్ కేటాజీన్స్ మరియు క్యూనిక్ యాసిడ్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ సమృద్దిగా ఉంటాయి.
ఇవి ఎముకల దగ్గర కార్టిలేజ్ బాగంలో హాని కలిగించే ఎంజైమ్స్ ని నిరోదించటానికి సహాయపడతాయి. కార్టిలేజ్ బాగుంటే ఎముకల సమస్యలు ఏమి లేకుండా ఉంటాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లేదా దానిమ్మ గింజలను తింటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
అలాగే ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. కుటుంబంలో ఎవరికైనా నొప్పులు ఉంటే మాత్రం ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాంటివారు కూడా ప్రతి రోజు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ లేదా దానిమ్మ గింజలను తీసుకుంటే భవిష్యత్ లో సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు మరియు వచ్చే అవకాశం ఉన్నవారు దానిమ్మ జ్యూస్ తాగితే మంచిది.
ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయు. కాబట్టి ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే బాధ విపరీతంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.