Suman బావ బావమరిది సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరు?

Suman Bava Bavamaridi movie : టాలీవుడ్ లో సినిమాల గురించిన విషయాలను తెలుసుకోవటానికి చాలా ఆసక్తిని కనపరుస్తారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు, సుమన్ కల్సి నటించిన బావ బావమరిది మూవీ అప్పట్లో మంచి హిట్ అయింది. ఈ సినిమా వివరాల్లోకి వెళ్తే,ఎడిటర్ మోహన్ ఒకసారి పాండిదురై తమిళ మూవీ చూస్తుండగా ఓ ఐడియా వచ్చింది.

సినిమా పెద్దగా బాగోకపోయినా హీరో ప్రభుకి ఖుష్బూ తో పెళ్లి అవుతుంది. కాపురానికి వెళ్లేముందు తన తమ్ముడిని వెంట తీసుకెళ్తుంది. అప్పటినుంచి బావకు తోడుగా బావమరిది ఉంటాడు. ఈ కాన్సప్ట్ తో తెలుగులో సినిమా తీయాలని రీమేక్ హక్కులు కొనేశారు. 9నెలలు కసరత్తు చేసి, కొత్త కథ తయారుచేసి, అప్పుడు ఆర్టిస్టుల సెలక్షన్ మొదలుపెట్టారు.

బావ జమీందారు పాత్ర కోసం రెబెల్ స్టార్ కృష్ణంరాజుని అనుకుని సంప్రదించగా,అప్పటికే సినిమాలు లేక ఖాళీగా ఉన్న అయన ఒకే చెప్పారు. అయితే బావమరిది రాజు వేషం కోసం నందమూరి నటసింహం బాలయ్యను సంప్రదించగా,రౌడీ ఇనస్పెక్టర్ మూవీ హిట్ తో మాస్ హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉండడంతో చేతులు కట్టుకుని వుండే ఈ పాత్రకు నో చెప్పేసాడు.

దాంతో చిన్నల్లుడు వంటి మూవీస్ తో మంచి రేస్ లో ఉన్న సుమన్ మీద దృష్టి పడింది. వెంటనే అడగ్గానే ఒప్పేసుకున్నాడు. ఈ మూవీ టైటిల్స్ లో నవరస కథానాయకుడు సుమన్ అని వేశారు. ఇక ఈ మూవీకి ఉత్తమ నటుడు అవార్డు కూడా సుమన్ అందుకున్నాడు. హీరోయిన్ గీత పాత్రకు మాలాశ్రీని సెలక్ట్ చేసారు. సుమన్ అక్కగా జయసుధ ను సెలక్ట్ చేసారు.జమిందారుని బుట్టలో వేసుకునే కీలకమైన చింతామణి పాత్రలో సిల్క్ స్మిత నటించింది.

చాలాకాలం తర్వాత స్క్రీన్ పై దర్శనమిచ్చిన సిల్క్ స్మిత తన ప్రాధాన్యతను నిరూపించుకుంది. బావలు సయ్యా సాంగ్ తో ఉర్రూతలూగించింది. పెదరాయుడుగా కోట శ్రీనివాసరావు, నారాయణగా బాబూమోహన్ ఆడియన్స్ బాగానే నవ్వించారు. 1993ఫిబ్రవరి 1న మొదలైన ఈ సినిమా మార్చి వరకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పూర్తిచేసుకుంది.

రాజ్ కోటి సంగీతం అదిరిపోయింది. బావ బావమరిది టైటిల్ ఎడిటర్ మోహన్, దర్శకుడు శరత్ నిర్ణయించగా, ఫిలిం ఛాంబర్ లో రామానాయుడు అప్పటికే బావమరిది పేరిట టైటిల్ రిజిస్టర్ చేయడంతో దాసరి నారాయణరావు జోక్యంతో ఒకే అయింది. జూన్ 4న రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. మామగారు, బావ బావమరిది మూవీస్ ని నిర్మించిన ఎడిటర్ మోహన్ ఒకే వేదికపై ఈ రెండు మూవీ శతదినోత్సవాలను నిర్వహించారు