ఎర్ర ద్రాక్షపండ్లు ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…?
Red Grapes Health benefits In telugu : ద్రాక్ష పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్షలో నలుపు, ఆకుపచ్చ, వంకాయ, ఎరుపు రంగులు ఉన్నాయి. అయితే ఎర్ర ద్రాక్షపండ్లు తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఎర్ర ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి -6, విటమిన్ కె, ఫోలేట్, జింక్, రాగి, పొటాషియం, మాంగనీస్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ లు సమృద్దిగా ఉంటాయి.
ఎర్ర ద్రాక్షలో వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించే రెస్వెరాట్రాల్ ఉంటుంది. రెస్వెరాట్రాల్ ఒక బలమైన యాంటీఆక్సిడెంట్, ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు ఉండుట వలన అనేక ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
ఎర్ర ద్రాక్షలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎర్ర ద్రాక్ష యూరిక్ యాసిడ్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది . ఇవి సిస్టమ్ నుండి యాసిడ్‌ను తొలగించడానికి మరియు మూత్రపిండాల పని ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించి జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది.
ఎర్ర ద్రాక్షలోని ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి కంటిశుక్లం నిరోధించడానికి ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి. కంటి చూపు మెరుగుదలకు సహాయపడి వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. ఆస్తమా ఉన్నవారిలో మంచి ఉపశమనం కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోదిస్తుంది.
బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షలోని ఫ్లేవనాయిడ్స్ మరియు రెస్వెరాటోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, రక్తం గడ్డకట్టడం మరియు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో గుండెకు సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.