First సినిమా హిట్ కొట్టినా…టాలీవుడ్ లో నిలబడలేకపోయిన బ్యూటీస్

Tollywood heroines First Movie : ఒకప్పుడు తెలుగులో తెలుగు హీరోయిన్స్ ఎక్కువ మంది ఉండేవారు. మన తెలుగు హీరోయిన్స్ చాలామంది బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా సత్తా చాటారు. అందులో శ్రీదేవి, జయప్రద తదితరులున్నారు. అయితే ఆతరువాత తెలుగు నేపధ్యం తక్కువ గల ఇతర భాషా హీరోయిన్స్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు.

ముఖ్యంగా హిందీ భామలు ఎక్కువమంది తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటేశారు. అయితే కొంతమంది తెలుగువాళ్లు వచ్చినా నిలదొక్కుకోలేక పోయారు. అలాంటి వాళ్లలో మాధవీలత ఒకరు.ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత ఎక్కువ సినిమాలు చేయకపోవడంతో మళ్ళీ జాడలేదు.

ఇక ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన ఈశ్వర్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ శ్రీదేవి తర్వాత లవర్ బాయ్ తరుణ్ తో ఓ మూవీ చేసి మళ్ళీ కన్పించలేదు. కలర్స్ ప్రోగ్రాంతో క్రేజ్ తెచ్చుకున్న కలర్స్ స్వాతి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అష్మా చెమ్మా సినిమాతో హిట్ అందుకుంది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో క్లిక్ కాలేదు.

నీకు నాకు డ్యాష్ డ్యాష్, ప్రేమ కథా చిత్రమ్ సినిమాలు చేసిన నందిత ఆ తర్వాత ఎందుకో ఇండస్ట్రీకి దూరమైంది. అలాగే అంతకు ముందు,అవే,అమీతుమీ సినిమాలు చేసిన తెలుగు బ్యూటీ ఇషా రెబ్బా ఆ తర్వాత నిలబడలేకపోయింది.ఈ రోజుల్లో సినిమాతో హిట్ కొట్టిన రేష్మ నిజానికి త్రిషా లా ఉంటుంది. మరి ఎందుకో ఆ తర్వాత ఈమెకు ఛాన్స్ లు రాలేదు. ఆవకాయ్ బిర్యానీ, బంఫర్ ఆఫర్,రామ రామ క్రిష్ణ సినిమాలో చేసిన బిందు మాధవి ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కన్పించలేదు.

పెళ్లి చూపులు సినిమాతో హిట్ అందుకున్న రితు వర్మ తర్వాత ఒకటి అర సినిమాలు చేసి మళ్ళీ జాడలేదు. బస్టాప్ సినిమాలో శ్రీ దివ్యతో కలిసి ఆనంది నటించింది.తెలంగాణ లోని వరంగల్ కి చెందిన ఈ బ్యూటీ మళ్ళీ తెలుగులో చేయకపోయినా,తమిళంలో నటిస్తోంది. ఇదే సినిమాలో నటించిన శ్రీ విద్య ఆతర్వాత కేరింత,మల్లెల తీరం సినిమాలలో నటించినప్పటికీ క్లిక్ కాలేదు.