iSmart Shankar సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ismart shankar full movie :డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. చాలా కాలం తరువాత ఈ చిత్రంతో అటు రామ్… ఇటు పూరి మంచి మాస్ హిట్ అందుకున్నారు. అయితే ఈ చిత్రం సక్సెస్ ను చూసి ఓ హీరో బాధపడుతున్నాడట.
ఆ హీరో మరెవరో కాదు. మన మెగా మేనల్లుడు సాయి తేజ్. విషయం ఏమిటంటే.. మొదట ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని పూరి తన తనయుడు ఆకాశ్ తో చేయాలనుకున్నాడట. అయితే ఇంత చిన్న వయసులో అంత మాస్ సినిమాని ఆకాష్ మేనేజ్ చేయలేదని భావించి… సాయి తేజ్ వద్దకు వెళ్ళి కథ వినిపించాడట.
అప్పటికి వరుస ఫ్లాపుల్లో ఉన్న తేజు.. ఇప్పుడు ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడం అవసరమా అని అతని సన్నిహితులు చెప్పడంతో… పూరికి నో చెప్పాడట. దీంతో అలా ఈ చిత్రం రామ్ వద్దకు వెళ్ళింది. ప్రస్తుతం ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకుని.. తేజు చాలా ఫీలవుతున్నాడట. మరి బ్లాక్ బస్టర్ ను వదులుకుంటే ఏ హీరోకైనా అలానే ఉంటుంది.