నాలుక రంగును బట్టి ఏ ఆరోగ్య సమస్య ఉందో చెప్పచ్చు… ఎలానో చూడండి

Tongue color : నాలుకను చూసి మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. నాలిక రంగును బట్టి చెప్పచ్చు. అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నాలుకను చూస్తారు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలిక లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది.

నాలుక ఉదా రంగులో ఉంటే రక్త ప్రసరణ సమస్యలు ఉన్నాయని అర్థం. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని కూడా అర్థం. అదే పాలిపోయినట్లు ఉంటే ఐరన్ లోపం ఉన్నట్టు. ఐరన్ లోపం అంటే రక్తహీనత సమస్య ఉన్నట్టు. అప్పుడు పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలి.
Top 10 iron rich foods iron deficiency In Telugu
నాలుక ఎర్ర రంగులో ఉంటే విటమిన్ బి లోపంగా చెప్పాలి. అలాగే జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది. యాంటీ బయోటెక్ మందులను ఎక్కువగా వాడితే నాలుక నల్లగా మారుతుంది. నోటిలోను, నాలుక మీద తరచుగా పుండ్లు ఏర్పడుతూ ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది అని అర్థం.

అప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ రోజులు నాలుకకు సంబంధించి సమస్యలు ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి.ఉదయం బ్రష్ చేసిన తర్వాత తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే నోట్లో బ్యాక్టీరియా పెరిగి అనారోగ్యానికి గురవుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.