MoviesTollywood news in telugu

నాని మిస్ చేసుకున్న హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో..!?

Nani rejected movies :తానొకటి దైవమొకటి తలచిందన్నట్లు నాని దర్శకుడిగా అడుగు పెట్టాలనుకుంటే, హీరో అయ్యాడు. క్లాప్ అసిస్టెంట్ గా కెరీర్ ను ప్రారంభించి, అనుకోకుండా అష్టా చమ్మా సినిమాతో తొలిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా నుండి మంచి అవకాశాలను నాని‌ అందుకుంటూ, డిఫరెంట్ మూవీస్ తో వరుస విజయాలను తెచ్చుకున్నాడు. తనకు తగ్గ కథను ఎంచుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే అందరిలాగే నాని కూడా వివిధ కారణాలవల్ల కొన్ని సినిమాలు వదిలేసుకోగా,అందులో ఎక్కువ సక్సెస్ మూవీస్ ఉన్నాయి.
Tollywood Hero Nani
నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో చాలామంది దర్శకులు, నటులు కనిపిస్తారు. అయితే ఇందులో నాగేశ్వరరావు పాత్రలో నానికి ఛాన్స్ వచ్చినా చేయలేదు. అలాగే నాగార్జున నటించిన ఊపిరి సినిమాలో కూడా హీరో కార్తీ చేసిన పాత్రలో మొదట నానికే ఛాన్స్ రాగా వదిలేసుకున్నాడు. రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమా లో మొదట నానికి వచ్చినా ఛాన్స్ చేజారింది.

సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీం, నితిన్ నటించిన గుండెజారి గల్లంతయిందే మూవీస్ హిట్ గా నిలిచాయి. ఇవి మొదట నాని వద్దకే వచ్చినా వదిలేసుకున్నాడు. నాగచైతన్య నటించిన తడాఖా , ఆది సాయి కుమార్ నటించిన సుకుమారుడు వంటి మూవీస్ కూడా కాదనుకున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాలో వచ్చిన ఛాన్స్ కూడా నాని మిస్ చేసుకోవడమే కాదు, శర్వానంద్ నటించిన శ్రీకారం, అలాగే జాను మూవీస్ కూడా చేజారాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."