ఒక నిమిషం చూపుడు వేలుని మసాజ్ చేస్తే …ఏమి అవుతుందో తెలుసా?
Finger massage benefits :ఏంటీ చేతి వేళ్లను రుద్దితే శరీరంలో అద్భుత మార్పులు జరగడం ఏంటీ అనుకుంటున్నారా…అవును ఇది నిజమేనండి బాబూ..మన చేతివేళ్లలో మన శరీరంలోని చాలా అవయవాలు అనుసంధానం అయ్యి ఉంటాయి.అందుకే మన చేతి వేళ్ళని రుద్దినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి.అయితే ఈ చేతి వేళ్లని అదే పనిగా రుద్దకూడదు. కొన్ని సెకన్ల పాటు రుద్దితే చాలు.. ఆ మార్పుని మనం గమనించ వచ్చు…
మనం ఒక్కొక వేలుని రుద్దడం వలన ఒక్కో ప్రయోజనం పొదవచ్చు..అయితే అవేంటో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం
బొటనవేలు
బొటనవేలు అనేది గుండెకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా గుండె దడ,శ్వాస సమస్యలు ఉంటే కొన్ని సెకన్లు బొటనవేలుని రుద్ది లాగినట్లు చేస్తే చాలు ఆ సమస్య తగ్గుతుంది.
చూపుడు వేలు
కోలన్, పొట్టతో చూపుడువేలు కనెక్ట్ అయ్యి ఉంటుంది.డయేరియా సమస్యతో భాధపడే వారు 60 సెకన్లు ఈ వేలుని రుద్దితే చాలు.
ఉంగరం వేలు
పొట్తలో గ్యాస్,ఉబ్బరం,కాన్స్టిపేషన్ సమస్యలు ఉన్నవారు ఉంగర వేలుని 60 సెకన్లు మసాజ్ చేయండి.. ఆ సమస్యలు దూరం అవుతాయి.
మధ్య వేలు
మధ్యవేలు వెనక భాగాన్ని కాసేపు రుద్దితే అలసట,,నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.ప్రయాణాల్లో ఇబ్బంది పడేవారికి ఇలా చేస్తే మంచిది.
చివరి వేలు
చివరి వేలుని 60 సెకన్లు రుద్దితే మైగ్రేన్,మెడనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
అరచేయి
అరచేయి నరాలతో కనెక్ట్ అయ్యి ఉంటుంది… కాబట్టి వీలైనన్ని సార్లు చప్పట్లు కొడితే చాలా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.