స్టార్ హీరో కొడుకు యంగ్ హీరోని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి

Akkineni Akhil : అక్కినేని ఫ్యామిలీ కి టాలీవుడ్ లో ఓ ప్రత్యేక స్థానం,గుర్తింపు ఉన్నాయి. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తనయుడిగా అఖిల్ మూవీతో టాలివుడ్ లో యంగ్ హీరో అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడో సిసింద్రీ మూవీలో బోసి చిరునవ్వులు చిందిస్తూ సినీ జనాల్ని ఆకట్టుకున్న అఖిల్ ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టి మూడు సినిమాలు చేసినా ఇంకా హిట్ దక్కలేదు.
Tollywood Hero Akhil
ఇతడికి హిట్ పడాలని నాగార్జున కూడా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’మూవీతో ఈ యంగ్ హీరో అఖిల్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.
Akkineni Akhil
తాజాగా అఖిల్ చిన్నప్పటి పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అఖిల్ కౌబాయ్ డ్రెస్సింగ్ స్టైల్ తో గన్ పట్టుకొని పోజిచ్చాడు. అయితే మహేష్ బాబు నటించిన టక్కరిదొంగ మూవీ షూటింగ్ సమయంలో సెట్స్ కు వెళ్ళినప్పుడు దిగిన ఫోటో అని తెలుస్తోంది.