పవన్ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా ?
Telugu Actress neha oberoi :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో బాలు మూవీ ఒకటి. ఈ మూవీలో నటన పరంగా అందరికీ మంచి మార్కులు పడ్డాయి. ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించగా ఇందులో ఇద్దరు హీరోయిన్లుగా ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీయ శరన్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ నేహా ఒబెరాయ్ నటించారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో నేహా కన్పించి ఆకట్టుకుంది.
ఆతర్వాత నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడం,బాలీవుడ్ లో సైతం ఛాన్స్ లు తగ్గిపోవడంతో సినిమా రంగానికి దూరమై,2010 లో విశాల్ షా అనే ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది. భర్తకి వ్యాపార పనుల్లో సాయపడుతోంది. నిజానికి నేహా సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది. ఆమె తండ్రి ధరమ్ ఒబెరాయ్ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాతగా రాణించడం వలన ఆమెకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే మక్కువ ఉంది.
ఆవిధంగా బాలు చిత్ర ఆడిషన్స్ లో హీరోయిన్ పాత్ర కోసం వెళ్లి సెలక్ట్ అయింది. ఇందులో ఈమె నటించిన సన్నివేశాల నిడివి తక్కువగా ఉన్నప్పటికీ చిత్రానికి హైలెట్ అయ్యాయి. ఆతర్వాత జగపతిబాబు హీరోగా నటించిన బ్రహ్మాస్త్రం మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఆతర్వాత మళ్లీ తెలుగులో హీరోయిన్ గా ఆమె కనిపించలేదు. అయితే ఏడాదికి ఒక సినిమాతో మూడు సినిమాలలో నటించి బాలీవుడ్ లో మెరిసినా, అక్కడా హీరోయిన్ గా నిలబడలేకపోయింది.