Healthhealth tips in telugu

వేసవిలో ఉదయం 1 గ్లాస్ తాగితే నీరసం,అలసట లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు

summer energy drink : వేసవిలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. మనం పనులను చేస్తూ చాలా బిజీగా ఉంటూ మన ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టకపోవటం వలన తీవ్రమైన అలసట,నీరసం వంటివి వచ్చేస్తాయి. అవి రాకుండా రోజంతా హుషారుగా పని చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పే డ్రింక్ ఉదయం సమయంలో తాగితే సరిపోతుంది.

చిన్న క్యారెట్,చిన్న బీట్ రూట్ లో సగం, అర అంగుళం అల్లం తీసుకొని పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు మునగ ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి నీటిని పోసి క్యారెట్,బీట్ రూట్,అల్లం ముక్కలు,మునగ ఆకులను వేసి బాగా ఉడికించాలి.

మిక్సీ జార్ లో ఉడికిన మిశ్రమాన్ని మరియు 4 స్పూన్ల ఆర్గానిక్ బెల్లం వేసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలను పోసి మరోసారి మిక్సీలో వేసి మిక్సీ చేయాలి. దీనిని ఒక గ్లాసు లో పోసుకొని తాగాలి. ఈ డ్రింక్ ని అన్నీ వయస్సుల వారు తాగవచ్చు. అంటే 5 సంవత్సరాల పిల్లల నుంచి తాగవచ్చు.
Ginger benefits in telugu
ఈ డ్రింక్ తాగటం వలన ఉదయం నుంచి సాయంత్రం వరకు అలసట,నీరసం లేకుండా హుషారుగా పని చేసుకుంటారు. శరీరంలో మలినాలు అన్నీ తొలగిపోతాయి. లివర్ కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వేసవిలో ఈ డ్రింక్ ని అసలు మిస్ చేసుకోవద్దు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.