Venkatesh పక్కన ఉన్న ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా ?

Venkatesh And Naga Chaitanya :ఇటు అక్కినేని వారసత్వమే కాదు, అటు దగ్గుబాటి ఫ్యామిలీతో కూడా సంబంధం గల అక్కినేని నాగ చైతన్య ఇప్పటికే పలుచిత్రాల్లో నటించాడు. అక్కినేని నాగార్జున నటవారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చైతు మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
Venkatesh
టాలీవుడ్ డైరెక్టర్ వాసూ వర్మ తెరకెక్కించిన జోష్ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన చైతూ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా కలియుగ పాండవులు మూవీతో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఎన్నో విజయవంతమైన చిత్రాలతో విక్టరీ వెంకటేష్ అయ్యాడు.
venkatesh and naga chaitanya
వెంకటేష్,నాగచైతన్య కల్సి వెంకీ మామ మూవీలో కల్సి నటించారు. ఇలా రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మేనమామే. వెంకటేష్ సోదరిని నాగార్జున పెళ్లిచేసుకోవడంతో వారిద్దరికీ పుట్టిన సంతానమే నాగచైతన్య. కాలక్రమేణా ఇద్దరూ విడిపోవడంతో నాగార్జున అమలను పెళ్లాడాడు. అయినా మేనమామతో సంబంధాలే కాదు,సినిమాలు కూడా చైతు పంచుకుంటున్నాడు.
Naga chaitanya assets
చిన్నపుడు వెంకీతో చైతు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సినిమా షూటింగ్ లోనే తీయించుకున్న ఫొటోలా ఉంది. అందుకే ఇరువురు ఫాన్స్ షేర్ చేస్తున్నారు.