2 నిమిషాల్లో పిప్పి పన్ను నొప్పి,చిగుళ్ళ వాపు తగ్గి జీవితంలో అసలు ఉండవు

pippi pannu Home remedies : పిప్పి పన్ను సమస్య ఉన్నప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. అలాగే చిగురు వాపు వంటివి కూడా వస్తాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఆహారం తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారానికి ఇంగ్లీష్ మందులు వాడుతున్న ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.

దీని కోసం ఆరు లవంగాలు, 4 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి. ఇక ఆ తర్వాత పొయ్యి మీద చిన్న పాన్ పెట్టి దానిలో దాదాపుగా 5 స్పూన్ల ఆముదం వేసి ఆ తర్వాత లవంగాలు,వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి మరిగించాలి. కాస్త చల్లారాక సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెలో కాటన్ డిప్ చేసి పిప్పి పన్ను మీద పెట్టి పావుగంట ఉంచుకోవాలి.
Diabetes tips in telugu
ఇలా రోజులో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాసి సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఉదయం బ్రష్ చేయటానికి అరగంట ముందు ఈ నూనెలో కాటన్ ముంచి పిప్పి పన్ను ఉన్న ప్రదేశంలో పెట్టాలి. అరగంట అయ్యాక బ్రష్ చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.