శ్రీమంతుడు సినిమా గురించి ఈ నిజాలు మీకు తెలుసా ?

Mahesh babu Srimanthudu Movie: సూపర్ స్టార్ కి మంచి కంటెంట్ గల స్టోరీ వస్తే,ఎలా ఉంటుందో,సమాజంపై ఆ మూవీ ప్రభావం ఎలా ఉంటుందో ఐదేళ్ల క్రితం తీసిన శ్రీమంతుడు మూవీ నిరూపించింది. దూకుడు తర్వాత ఓపక్క స్టార్ డైరెక్టర్స్ కథలు వింటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, మరోపక్క రామ్ చరణ్ తో మూవీ స్టార్ట్ చేసి కేన్సిల్ అయిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇద్దరూ కల్సి చేసిన సినిమా శ్రీమంతుడు.
mahesh babu
మెసేజ్,కమర్షియల్ హంగామా జోడించి కొరటాల శివ చెప్పిన కథకు మహేష్ ఒకే చెప్పాడు. మొదట్లో యుకె సంస్థ ఈ మూవీ నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ కొరటాలతో చిన్న చిన్న విబేధాల కారణంగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్మాణానికి ముందుకొచ్చింది. జిఎంబి బ్యానర్ తో మహేష్ కూడా భాగస్వామ్యం అయ్యాడు. హీరోయిన్ గా శృతిహాసన్. హీరో తండ్రి పాత్రకు మహేష్ స్వయంగా అడగడంతో జగపతిబాబు ఒకే చేసాడు. మదర్ క్యారెక్టర్ చిన్నదని నదియా ఒప్పుకోలేదు.

రామానాయుడు స్టూడియోస్ లో 2014 ఆగస్టు 12న లాంచ్. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్. అప్పటికే సాంగ్స్ రికార్డింగ్ అయిపోయింది. 140 పనిదినాలతో షూటింగ్ పూర్తి. మామిడితోట ఫైట్ లో మహేష్ కి నిజంగా దెబ్బ తగలడంతో ఫైటర్ ని అందరూ తిట్టబోతే మహేష్ వారించాడు. మంచివాడు,బుద్ధిమంతుడు లాంటి టైటిల్స్ అనుకున్నా,2015 మే31న శ్రీమంతుడు టైటిల్ తో తొలిపొస్టర్ వచ్చింది.

సైకిల్ పై స్టైల్ అదిరింది. జులైలో మూవీ రిలీజ్ అని ప్రకటించారు. అయితే బాహుబలి యూనిట్ రిక్వెస్ట్ తో గ్యాప్ కావాలని అడగడంతో ఆగస్టు 7న శ్రీమంతుడు 2500థియేటర్లలో రిలీజయింది. ఉదయం ఆటనుంచే బ్లాక్ బస్టర్ టాక్. యుఎస్ లో హంగామా అదిరిపోయింది. గ్రామాల దత్తత అంశం బాగా కనెక్ట్ అయింది. బాహుబలి రేంజ్ మూవీ ఉన్నా సరే, శ్రీమంతుడిని ఆదరించారు.

ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అని మహేష్ బాబుని ఎందుకు అంటారో ఈమూవీ లో నటన తెలిపింది. ఎందరో సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకునేలా ఈ మూవీ చేసింది. ఈ మూవీని ప్రధాని మోడీ కూడా అభినందించారు. శృతిహాసన్ నటనను ఈ మూవీ ఆవిష్కరించింది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సంపత్,ముఖేష్,ఋషి ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు. మిర్చి తర్వాత రెండో సినిమా శ్రీమంతుడుతో హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

600కోట్ల గ్రాస్ తో బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన నేపథ్యంలో మిగిలినవన్నీ నాన్ బాహుబలి రికార్డులయ్యాయి. 185సెంటర్స్ లో 50రోజులు,9సెంటర్స్ లో 100రోజులు ఆడింది. అందులో మొదటిది శ్రీమంతుడు ఎపి,తెలంగాణాలలో 60కోట్లు,వరల్డ్ వైడ్ గా 85కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. నైజాం 22కోట్లు,ఓవర్సీస్ లో 15కోట్లు కలెక్ట్ చేయడం సూపర్భ్. 57కోట్ల ప్రీరిలీజ్ చేస్తే, 30కోట్ల లాభం తెచ్చిన సినిమా ఇది. మహేష్ కి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. ఇక తమిళంలో విడుదలై హిట్ కొట్టింది.