ఇలా చేస్తే 99% మోకాళ్ళ నొప్పులు,joint pains,కండరాల నొప్పులు పూర్తిగా తగ్గి జీవితంలో ఉండవు
Joint Pains HomeRemedies : ఒకప్పుడు కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు అనేవి అరవై సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేవి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా చిన్న వయస్సులోనే అంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. నొప్పులు ప్రారంభంలో ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.
దీని కోసం ఒక బౌల్ లో అరస్పూన్ పసుపు, అరస్పూన్ శొంఠి పొడి,అరస్పూన్ దాల్చినచెక్క పొడి, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి దాని మీద ఒక క్లాత్ చుట్టి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు, చిటికెడు శొంఠి పొడి వేసి మూత పెట్టి పది నిమిషాలు అలా వదిలేయలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటివి అన్నీ తొలగిపోతాయి. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
పసుపు, శొంఠి, దాల్చిన చెక్కలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ పొడులను మార్కెట్ లో కొనటం కన్నా ఇంటిలో తయారుచేసుకోవటం మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.