హిట్ అవ్వాల్సిన ఈ సినిమాలు ఎందుకు ప్లాప్ అయ్యాయో చూడండి
Tollywood Movies Hits And Flops: వరుస ప్లాప్ లతో సతమతమయ్యే హీరో డాక్టర్ రాజశేఖర్ మళ్ళీ అంకుశం లెవెల్లో నటించిన మూవీ గరుడవేగ. మంచి కథనం,డిజైన్, డాక్టర్ రాజశేఖర్ పాత్ర ఇలా అన్నీ సూపర్భ్. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నా రావాల్సినంత క్రేజ్ రాలేదు. సోషల్ మీడియాలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
గౌతమ్ మీనన్ మంచి సీన్స్ రాసుకుంటాడు. అలా తీసింది ‘మళ్ళీ రావా’ మూవీ ని థియేటర్ లో ఆదరించిన వాళ్ళు తక్కువ. ఆన్ లైన్ లో ఎక్కువమంది వీక్షించారు. తొలిప్రేమ తర్వాత అంతటి ఫీల్ గుడ్ మూవీ ఇది. క్లైమాక్స్ అదిరింది. తమిళం, మలయాళంలో 96ఎంతటి హిట్ కొట్టిందో తెలుగులో మళ్ళీ రావా మూవీ హిట్ కావాల్సింది.
రామ్ చరణ్ చిరుత మూవీ తర్వాత అంతటి స్ట్రెంత్ ఉన్న మూవీ జోష్. స్టోరీ, సాంగ్స్,డైలాగ్స్ ఇలా అన్ని అదిరిపోతాయి. భారీ అంచనాలతో రావడం వలన అనుకున్న రేంజ్ తెచ్చుకోలేదు.
నేను మీకు తెలుసా’ మూవీ అప్పట్లో చాలా డిఫరెంట్ మూవీ. ఇక స్టెంట్స్ కూడా మనోజ్ ఒరిజనల్ గా డిజైన్ చేసాడు. అయితే ఈ సినిమాను ఎందుకో ఆదరించకుండా ఆ సమయంలో వచ్చిన కొత్త బంగారు లోకం వైపు వెళ్లిపోయారు.
సందీప్ కిషన్ మూవీస్ చూస్తే, అదృష్టం ఎంతుందో , దురదృష్టం కూడా అంతే ఉంటుందని ‘ప్రాజెక్ట్ జెడ్’ మూవీ చూస్తే తెలుస్తుంది. ఇది తమిళ సీనిమా కావడంతో తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో లేదో కూడా తెలీని మూవీ. మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. జనం చూడకపోవడం కన్నా జనాల్లోకి తీసుకెళ్లలేకపోయారని చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్స్ గొడవలు వంటివాటితో నెగెటివ్ ప్రచారం ఎక్కువ అయింది.
అప్పట్లో ఒకడుండేవాడు’అనే టైటిల్ వెరైటీ గా ఉంది. సాగర్ కె చంద్ర డైరెక్షన్ చేసిన ఈ మూవీకి రావాల్సినంత ప్రచారం జరగలేదు. పాపం నారా రోహిత్ ని దురదృష్టం వెంటాడింది. క్లైమాక్స్ సినిమాకి హైలెట్. ఇక శ్రీవిష్ణు యాక్టింగ్ కూడా బానే చేసాడు.