నాగార్జునతో జోడి కట్టిన ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా..??

Tollywood Heroine geethanjali Facts: ఇప్పుడొక ఫోటో నెట్ లో చక్కర్లు కొడుస్తోంది. ఆ ఫోటోలో ఉన్న ఒకప్పటి హీరోయిన్ ఈతరం ప్రేక్షకులు గుర్తుపట్ట లేరు. సడెన్ గా చూస్తే, ఈ జెనరేషన్ ఆడియన్స్ మాత్రమే కాదు.. 80.. 90 దశకంలో ల సిని ప్రేమికులు కూడా గుర్తు పట్టలేరు. అవును ఈ హీరోయిన్ వయసు ఇప్పుడు 50 ఏళ్ళు . కేవలం నటించింది నాలుగైదు సినిమాలు.. వాటిలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమా ఒకటే ఉంది అదేమిటంటే, నాగార్జున కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయిన ‘గీతాంజలి’ మూవీ. ఈమె పేరు గిరిజ అని కొంతమందికి గుర్తు రావొచ్చు.

అవును మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీతాంజలి’ తర్వాత గిరిజ షెట్టార్ ఆతర్వాత ఓ మూడు నాలుగు సినిమాల్లో నటించింది కానీ అవేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ‘గీతాంజలి’ సినిమా చూసిన వారెవరూ గిరిజను ఎప్పటికీ మర్చిపోలేరు. రీసెంట్ గా ఈమె ట్విట్టర్ లో గీతాంజలి సినిమాకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ను షేర్ చేసుకుంది.

అప్పటి జెనరేషన్ వారికి గీతాంజలి సినిమా అంటే ఓ మరపురాని జ్ఞాపకం. ఇక అల్లరిపిల్ల పాత్రలో గిరిజ నటించిన తీరు కూడా ఎవరూ మర్చిపోలేరు. ఇంతకాలం తర్వాత అదే హీరోయిన్ ట్విట్టర్ లో యాక్టివ్ కావడం అప్పటి అభిమానులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ గా మారింది ‘గీతాంజలి’ సినిమా ఏకాంతంగా.. యాడ్స్ డిస్టర్బెన్స్ లేకుండా.. చూస్తే ,ఈమె నటనకు నీరాజనం పట్టడం ఖాయం. మరి అంతటి ఓపిక ఈ తరానికుందా.