Healthhealth tips in telugu

గుప్పెడు తింటే చాలు డయాబెటిస్,రక్తపోటు,రక్తహీనత,అధికబరువు సమస్యలు అసలు ఉండవు

Black Beans Health Benefits : బ్లాక్ బీన్స్ లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని వారంలో రెండు సార్లు తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. బ్లాక్ బీన్స్‌లో మెగ్నీషియం, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్,మాంగనీస్ మరియు కాపర్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉండుట వలన ఎముకల నిర్మాణాన్ని నిర్వహించడానికి సహాయపడి ఎముకలు మరియు కీళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
black beans
పొటాషియం సమృద్ధిగా మరియు సోడియం తక్కువగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో సోడియం స్థాయిని తగ్గించడంలో పొటాషియం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బ్లాక్ బీన్స్‌లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
gas troble home remedies
అంతేకాక గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. అలాగే అధిక బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. వీటిని తీసుకుంటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. బ్లాక్ బీన్స్‌లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. మెగ్నీషియం మరియు ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బ్లాక్ బీన్స్ సహాయపడతాయి.

బ్లాక్ బీన్స్‌లో ఉండే ఫోలియేట్స్ గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాకుండా, నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని నిర్వహించడానికి కూడా మంచిది. బ్లాక్ బీన్స్‌లో ఉన్న అమైనో ఆమ్లాలు నాడీ వ్యవస్థకు అవసరమైన ముఖ్యమైన పదార్ధం. ఇది అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.