విక్టరీ వెంకటేష్ పక్కన ఉన్న ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా ?

Venkatesh And Sumanth: విక్ట‌రీ వెంక‌టేష్ ఆప్యాయంగా భుజంపై చేతులు వేసిన ఆ కుర్రాడు..టాలీవుడ్‌లో హీరో. రెండు ద‌శాబ్దాల నుంచీ సినీ పరిశ్రమలో ఉన్న‌ప్ప‌టికీ.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆయన కేరీర్‌లో కొట్టిన హిట్లు మాత్రం నాలుగైదుకు మించ‌వు. ఆ హీరో మ‌రెవ‌రో కాదు. అక్కినేని నాగేశ్వరరావు మనవుడు సుమంత్. అక్కినేని మనవుడు నాగార్జున మేనల్లుడుగా సినీ పరిశ్రమకు ప్రేమకథ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమకథ సినిమాను నాగార్జున సొంత బేనర్ లో నిర్మించాడు.
sumanth new movie
ఆ సినిమా పర్వాలేదని అనిపించింది. కానీ కథల ఎంపికలో చేసిన తప్పుల కారణంగా సుమంత్ కాస్త వెనక పడ్డాడని చెప్పవచ్చు. కెరీర్ ఆలా ఆలా సాగుతున్న సమయంలో కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వారి మధ్య అభిప్రాయ భేదాలు రావటంతో విడిపోయారు. ఆ తరవాత కూడా సినిమాలు చేసిన ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వలన ఆశించిన ఫలితాలు రాలేదు.మంచి సినిమాలు సుమంత్ చేయాలనీ కోరుకుందాం.