యూరిక్ యాసిడ్ ఉన్నవారు వాల్ నట్స్ తీసుకుంటే…ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు…

uric acid problem Walnuts : ఈ మధ్యకాలంలో మనలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో మోతాదుకు మించి ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
The Best Nuts for Diabetes
ఈ సమస్యలు ఉన్నప్పుడు ముందుగా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్ష చేయించుకోవాలి. దాన్నిబట్టి డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే ఆయుర్వేద రెమిడీని కూడా ఫాలో అయితే చాలా తొందరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.
uric acid
ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. అవి క్రమంగా స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
యూరిక్ యాసిడ్ ని తగ్గించటానికి వాల్ నట్స్ మంచి ఔషధంగా పనిచేస్తుంది.
...WalNuts Benefits In telugu
ఒకప్పుడు వాల్ నట్స్ ని చాలా అరుదుగా లభించేవి. ఇప్పుడు చాలా విరివిగా లభిస్తున్నాయి. వాల్‌నట్స్‌లో అనేక ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు మరియు ఖనిజాలు ఉంటాయి, ఇవి శరీరానికి పోషణను అందించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వాల్‌నట్‌లలో యాంటీ-ఆక్సిడెంట్లు మరియు పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌ లు కూడా సమృద్దిగా ఉంటాయి.
walnut benefits in telugu
ఇవన్నీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించటానికి మరియు యూరిక్ యాసిడ్‌ను శరీరం నుండి తొలగించడంలో సహాయపడతాయి. రోజుకి రెండు వాల్ నట్స్ ని 5 గంటలు నీటిలో నానబెట్టి..ఆ తర్వాత పై తొక్క తీసి తినాలి. ఈ విధంగా వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.