ఈ ఒక్క చపాతీ నరాల బలహీనత, డయాబెటిస్, అధిక బరువు, రక్తహీనత సమస్యలు లేకుండా చేస్తుంది

foxtail millet korralu benefits : చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రల్లో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ తో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం,ప్రోటీన్ఉం టుంది. కొర్రలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
korralu
కొర్రలలో పీచు, ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన శ్వాస కోశ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగడానికి సహాయపడి నరాల బలహీనత లేకుండా చేస్తుంది. కొర్రల్లో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తాన్ని వృద్దిచేస్తుంది.

కొర్రలు బరువు తగ్గించటంలో కూడా బాగా సహాయపడుతుంది. కొర్రలను తినటం వలన ఆకలి తొందరగా వేయకుండా నియంత్రణలో ఉంటుంది. అలాగే కండరాలకు బలాన్ని అందిస్తుంది. డయాబెటిస్ ఉన్న ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయి అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలను తగ్గించి డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
Weight Loss tips in telugu
కొర్రలతో చపాతీ చేసుకొని రాత్రి సమయంలో తింటే మంచి ఫలితం కనపడుతుంది. ఒక కప్పు కొర్రల పిండిలో ఒక స్పూన్ మినప పిండి, అరస్పూన్ వాము, సరిపడా ఉప్పు వేసి వేడి నీటితో పిండి కలిపి చపాతీ చేసుకొని తినవచ్చు. లేదా కొర్రలతో అన్నం వండుకొని తినవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్ కొరతను తీర్చటంలో కొర్రలు కీలకమైన పాత్రను పోషిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.