ఈ హీరో గుర్తు ఉన్నాడా…ఈ హీరో భార్య ప్రొడ్యూసర్ అని తెలుసా?

Tamil actor srikanth wife vandana :తెలుగులో సినిమాలు వివిధ భాషల్లో డబ్బింగ్ కావడం ద్వారా మన హీరోలు ఆయా భాషల్లో ఎలా ప్రాచుర్యం పొందారో అలాగే ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్ తెలుగులో తక్కువ సినిమాలలో నటించినప్పటికీ ఎక్కువ గుర్తింపు పొందాడు.
Tamil actor srikanth wife vandana
గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న శ్రీకాంత్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. విదేశాల్లో స్టడీస్ పూర్తిచేసి, శ్రీకాంత్ నటనపై ఉన్న ఆసక్తితో లక్షల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని మరీ సినిమా పరిశ్రమకి వచ్చాడు.
srikanth
సినీ నటుడు, దర్శకుడు శశి దర్శకత్వం వహించిన రోజా పూలు మూవీ ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో తన చిత్రాలని అప్పుడప్పుడు తెలుగులో డబ్బింగ్ ద్వారా రిలీజ్ చేస్తూ తమిళ భాషతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు.
srikanth
రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్లు శ్రీకాంత్ ఆశించిన స్థాయిలో తన చిత్రాలతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా కథల విషయంలో ఆలోచించి వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య నితిన్ హీరోగా నటించిన లై మూవీలో రెండో హీరోగా శ్రీకాంత్ నటించి పర్వాలేదనిపించినప్పటికీ ఆ మూవీ డిజాస్టర్ అయింది. అలాగే .. రాగల 24 గంటల్లో అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించినప్పటికీ పెద్దగా కలిసి రాకపోవడంతో శ్రీకాంత్ చిత్రాలకి అతడి భార్య వందన సహ నిర్మాతగా ఉంటోంది.
Srikanth
సినీ బ్యాగ్రౌండ్ లో ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో ఆమెకు ప్రొడక్షన్ పనుల్లో మంచి పట్టు ఉండడం వల్లనే తన భర్త చిత్రాలకి తానే సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ఓ ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించింది