ఇలా చేస్తే 7 రోజుల్లో ఎంతటి భారీ పొట్ట అయినా,తొడల దగ్గర కొవ్వు అయినా సులభంగా కరిగిపోతుంది
Best Weight Loss Drink In telugu : మారిన జీవనశైలి, ఎక్కువసేపు అలా కూర్చోవటం, శారీరక శ్రమ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు.
ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే వారం రోజుల్లోనే తేడా కనపడుతుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి దానిలో గుప్పెడు శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులను వేయాలి. పుదీనాలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండుట వలన జీర్ణప్రక్రియ బాగా సాగేలా చేసి బరువును తగ్గిస్తుంది.
ఆ తర్వాత చిన్న నిమ్మకాయను కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది.
ఆ తర్వాత అంగుళం దాల్చిన చెక్క ముక్క లేదా పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి పది నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా 7 రోజుల పాటు తాగితే తేడా చాలా బాగా కనపడుతుంది. అలాగే ఈ డ్రింక్ తాగటం వలన సీజనల్ గా వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి.
ఈ డ్రింక్ ని తాగుతూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తేనే మంచి ఫలితం కనపడుతుంది. బరువు ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలి. కానీ ఒక్కసారిగా తగ్గిపోకూడదు. ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు బరువు తగ్గటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.