గ్రామాలను దత్తత తీసుకున్న సెలబ్రేటీస్ ఎంత మందో…?

Tollywood heroes Adopted Villages :శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం చూపించారు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ దత్తత కాన్సెప్ట్ చాలామందికి నచ్చింది. దాంతో కొందరు హీరోలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధికి బాటలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం గ్రామాన్ని మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రిగా ఉండగా దత్తత తీసుకుని,కేంద్ర పథకాలు ప్రజలకు దగ్గరయ్యేలా చేసారు.
Chiranjeevi Dance Skills
తెలంగాణకు చెందిన సిద్ధాపురం,ఏపీలో బుర్రిపాలెం గ్రామాలను సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకుని అక్కడ ప్రజలకు సౌకర్యాల కల్పనలో తోడ్పాటునిస్తున్నారు. కరెంట్,కమ్యూనిటీ హాల్,రోడ్లు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా బలమూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామాన్ని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నాడు. అధికారులతో పోరాటం చేసి మరీ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసారు.

హీరో సుమన్ కూడా మహబూబ్ నగర్ జిల్లాలోని సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి అవగాహన, చైతన్యం అక్కడి ప్రజల్లో కల్పించారు. తిరుపతి దగ్గరలోని 5గ్రామాలను మంచు విష్ణు దత్తత తీసుకుని ప్రత్యేక కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తున్నారు. ఇక కొందరు ప్రముఖులు కూడా గ్రామాల దత్తత స్వీకారం చేసి,అభివృద్ధి చేస్తున్నారు.