Healthhealth tips in telugu

శనగలను ఎక్కువగా తింటున్నారా…తినే ముందు ఈ ఒక్క నిజాన్ని తెలుసుకోకపోతే నష్టపోతారు

Chickpeas Health Benefits in telugu:ఏ ఆలయంలోనైనా.. ఏ ఇంట్లోనైనా ప్రత్యేక పూజలు చేశారంటే శనగలను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఉడికించి నైవేద్యంగా సమర్పించే ఈ శనగలు అంటే అందరికి ఇష్టమే. సాయంత్రం సమయంలో పిల్లలకు స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు. పొట్టు తీయ‌కుండానే ల‌భించే శ‌న‌గ‌ల‌ను లేదా లావుగా ఉండే మ‌రో ర‌క‌మైన కాబూలీ శ‌న‌గ‌ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ఈ శనగలను నానబెట్టి లేదా ఉడకబెట్టి ప్రతి రోజు తింటూ ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. శనగల్లో మెగ్నీషియం,థయామిన్,ఇనుము,సోడియం,పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించటంలో కీలకమైన పాత్రను  పోషిస్తాయి. వీటితో పాటు పీచు, ఫైథో నూట్రియంట్స్ కూడా ఉంటాయి.  
chickpeas in telugu
ఈ శనగలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయి. శనగలను.. పేదవాడి బాదాం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే..బాదాంలో లభించే ప్రొటీన్ శాతం.. శనగల ద్వారా కూడా పొందవచ్చు. అందుకే.. అత్యంత ఖరీదైన బాదాం కంటే.. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Immunity foods
శనగల్లో ఉండే మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటమే కాక శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు కూడా శనగలను ఎటువంటి ఆలోచన లేకుండా నిరభ్యన్తరంగా తినవచ్చు. ఎందుకంటే రక్తంలో తగినంత గ్లూకోజ్, చక్కర స్థాయిలని అదుపులో ఉంచటంలో శనగలు కీలకపాత్ర పోషిస్తాయి.
Diabetes In Telugu
అలాగే ఇందులో ఉండే పీచు కూడా చక్కెరను నియంత్రిస్తుంది.శనగల్లో ఉండే పైథో న్యూట్రియంట్స్,ఆస్టియో ఫ్లోరోసిస్ తో పోరాటం చేస్తాయి. అలాగే క్యాన్సర్ తో పోరాటం చేయటమే కాకుండా నాశనం చేస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి శనగలు దివ్య ఔషధం అని చెప్పాలి. ఎందుకంటే శనగల్లో ఇనుము సమృద్ధిగా ఉండుట వలన శరీరానికి అవసరమైన ఇనుము లభించి రక్తహీనత సమస్య తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.