MoviesTollywood news in telugu

ఈ హీరోని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా ?

Tollywood Actor Mike Mohan :తెలుగు పరిశ్రమ చాన్నాళ్లు మద్రాసులోనే ఉంది. ఇప్పటికీ అక్కడ మకాం ఉంటున్న నటులు, టెక్నీషియన్స్, సింగర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే అప్పట్లో తెలుగు హీరోలు తమిళంలో క్లిక్ అయ్యారు. అందులో సుధాకర్ లాంటివాళ్లు. ఇక తెలుగులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, భాగ్యరాజా, కార్తీక్(మురళి), సుమన్,ఇలా చాలామంది తెలుగులో బాగా క్లిక్ అయ్యారు.

ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఆతర్వాత స్ట్రైట్ మూవీస్ లో కూడా ఇప్పటికీ సూర్య, విక్రమ్, కార్తీక్ లాంటి వాళ్ళు కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్, రజనీకాంత్ మాత్రం తెలుగు సినిమాలో తెలుగు డైరెక్టర్లతో చేస్తూ పెద్ద హీరోలు గా గుర్తింపు పొంది, తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ సొంతం చేసుకున్నారు.

విశ్వనాథ్ దర్శకత్వంలో శుభ సంకల్పం, సాగరసంగమం, స్వాతిముత్యం లాంటి సినిమాల్లో నటించి నటనలో తనకు పోటీ ఎవరు లేరని చూపించిన హీరో కమల్ హాసన్ కి పోటీ గా తెలుగులో రజనీకాంత్ నటించిన భాష, ముత్తు, నరసింహ లాంటి సినిమాలు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీళ్ళతో పాటు అప్పట్లో వీళ్లతో పాటు మోహన్ అనే ఇంకో హీరో కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో కనిపించాడు.

తమిళ్ లో మోహన్ తీసిన కోకిల సినిమా అక్కడ సంవత్సరం ఆడింది దాంతో ఆయనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. తమిళంలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అప్పటికే ఇక్కడ కార్తీక్, ప్రభు లాంటి హీరోలు తెలుగులో కూడా రాణిస్తున్న నేపథ్యంలో మోహన్ కూడా తెలుగువైపు మొగ్గు చూపించాడు. బాపు తీసిన తూర్పు వెళ్ళే రైలు సినిమా లో మోహన్ నటించాడు.

అయితే ఇతడికి మైక్ మోహన్ అని కూడా పేరుంది. చాలా సినిమాల్లో ఎక్కువగా మైక్ పట్టుకొని పాటలు పాడే పాత్రలు చేయడం వల్ల మైక్ మోహన్ గా, అలాగే అయితే కోకిల సినిమా హిట్ తో కోకిల మోహన్ గా కూడా పాపులర్ అయ్యాడు. ఎందుకో గానీ, మోహన్ కొన్ని ఏళ్ళు గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో వంశీ డైరెక్షన్లో ఆలాపన సినిమా చేసాడు.

ఆ తర్వాత జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన చూపులు కలిసిన శుభవేళ సినిమాలో నటించాడు. మణిరత్నం తెరకెక్కించిన మౌనరాగం లో కూడా మోహన్ నటించాడు. అందులో కార్తీక్, రేవతి హీరో హీరోయిన్లుగా చేసారు. ఇలా వంశీ , బాపు, జంధ్యాల , మణిరత్నం డైరెక్షన్ లో నటించడం మోహన్ కే సాధ్యపడిందని చాలామందికి తెలీదు.