Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారు తులసి ఆకులను తింటే ఏమి అవుతుందో తెలుసా?

Diabetes Tulasi Leaves : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారంలో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తులసిని తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు ఉదయం 4 లేదా 5 ఆకులను శుభ్రంగా కడిగి నమిలి తినవచ్చు.
Tulasi health benefits In telugu
తులసి ఆకులను రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగుతూ తులసి ఆకులను నమిలి మింగవచ్చు. లేదా తులసి ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. తులసిని ఎలా తీసుకున్న డయాబెటిస్ ఉన్నవారికి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
Diabetes diet in telugu
తులసి ఆకులలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన ప్యాంక్రియాటిక్ బీటా-సెల్ పనితీరు మరియు ఇన్సులిన్ స్రావాన్ని మెరుగు పరుస్తుంది. కండరాల కణాల ద్వారా గ్లూకోజ్‌ను మరింతగా సంగ్రహిస్తుంది. అప్పుడు గ్లూకోజ్‌ రక్తంలోకి చేరదు. తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మరియు డయాబెటిస్ యొక్క సమస్యలను నివారిస్తుంది.
cholesterol
డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. వీటిని తగ్గించటంలో తులసి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. తులసి ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీవక్రియ వ్యాధులు మరియు డయాబెటిస్ కి ప్రధాన కారణమైన ఆక్సీకరణ ఒత్తిడి యొక్క దుష్ప్రభావాలను తగ్గించటంలో సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.