Healthhealth tips in telugu

ఉల్లిపాయ పొట్టును పాడేస్తున్నారా…ఈ విషయం తెలిస్తే అసలు పాడేయరు

Onion Peel benefits In Telugu : ఉల్లిపాయను మనం ప్రతి రోజు వంటల్లో ఉపయోగిస్తాం. వేసవిలో వేడి తగ్గటానికి ఉల్లిపాయను పెరుగు, మ‌జ్జిగ వంటి వాటిల్లో వేసుకొని తీసుకుంటూ ఉంటాం. ఉల్లిపాయలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయలోనే కాకుండా మనం తీసి పడేసే ఉల్లిపాయ పొట్టు వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 
How to cut onions without crying In Telugu
కానీ ఆ తొక్కల్లో కూడా కొన్ని రకాల ఉపయోగాలుంటాయన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు కూడా ఉల్లిపాయ పొట్టును పాడేయరు. ఇప్పుడు ఉల్లిపాయ పొట్టులో ఉన్న లాభాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శరీరంలో చెడు కొలస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.
Weight Loss Tips in telugu
దాంతో శరీర బరువు తగ్గటమే కాకుండా గుండె సమస్యలు కూడా రావు. అంతేకాక యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ ఏజెంట్‌గా పనిచేసి శరీరంలో ఇన్ ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. ఉల్లిపొట్టు సూప్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. క్వ‌ర్సెటిన్ అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఉండుట వలన పలు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా మరియు క్యాన్స‌ర్ క‌ణ‌తుల వృద్ధిని త‌గ్గించే గుణం ఉంది.

ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని నొప్పులు, వాపులు ఉన్న ప్రదేశంలో రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఏమైనా చర్మ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఒక గిన్నెలో నీటిని తీసుకోని దానిలో ఉల్లిపాయ పొట్టును వేసి, ఆ గిన్నెను కిటికీలు లేదా గుమ్మం వ‌ద్ద పెడితే ఇంట్లోకి దోమ‌లు, ఈగ‌లు రావు.
Hair Fall Tips In Telugu
ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాస‌న వాటికి న‌చ్చ‌దు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. తలస్నానము చేయటానికి ముందు తల మీద ఉల్లిపాయ పొట్టుతో బాగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయటం వలన వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు దృఢంగా పెరుగుతుంది. చుండ్రు వంటి  ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా  పోతాయి. అంతేకాక ఉల్లిలోని సల్ఫర్… పాడైన, సన్నబడిన వెంట్రుకల్ని బలంగా చేస్తుంది. తెల్ల జుట్టును గోధుమ, బంగారం రంగులోకి మార్చుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.