Healthhealth tips in telugu

ఇలా తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు

Cholesterol Reduced : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. డయాబెటిస్ ఉన్నవారిలో చాలా త్వరగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
dark chocolate benefits in telugu
ప్రతి రోజు చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తింటే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కణాల నష్టాన్ని నిరోదించటంలో సహాయపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గితే రక్తసరఫరా బాగా సాగి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు వంటలలో ఆలివ్ నూనె వాడితే మంచిది. మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉండుట వలన గుండెను ఆరోగ్యంగా ఉంచి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీనితో పాటు, ఆలివ్ నూనె చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను, ట్రైగ్లిజరైడ్లను కూడా నియంత్రించగలదు.
chickpeas in telugu
ప్రతి రోజు ఒక స్పూన్ శనగలను నానబెట్టి ఉడికించి తినవచ్చు. శనగలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది. వీటిలో ప్రోటీన్ కూడా చాలా సమృద్దిగా ఉంటుంది. శనగల్లో అసంతృప్త కొవ్వులు, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫోలేట్ మరియు మినరల్స్‌ సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
weight loss drink
చియా గింజలను సూపర్ ఫుడ్ గా చెప్పుతారు. చియా గింజల్లో కరిగే ఫైబర్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లం , ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ సమృద్దిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే లిపిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. దాంతో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి చియా విత్తనాలను ఆహారంలో చేర్చవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.