‘త్రినయని’ హాసిని గురించి నమ్మలేని విషయాలు…మీకు తెలుసా?

Trinayani serial actress vishnu priya : త్రినయని సీరియల్ ప్రేక్షకుల ఆదరణతో చాలా విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ సీరియల్ లో హాసిని క్యారెక్టర్ వేసిన విష్ణు ప్రియ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. విష్ణు ప్రియ బుల్లితెర అభిమానులకు పరిచయమే. ప్రస్తుతం విష్ణు ప్రియ త్రినయని, జానకి కలగనలేదు…రెండు సీరియల్స్ లో నటిస్తుంది.

రెండు సీరియల్స్ లో ఒకేసారి నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.. విష్ణు ప్రియ కెరీర్లో 40 సినిమాల వరకు చేసింది. ఆ తర్వాతే సీరియల్స్ వైపుకు వచ్చింది. త్రినయని కంటే ముందుగా ఇద్దరు అమ్మాయిలు, అభిషేకం వంటి సీరియస్ లో నటించింది.

అభిషేకం సీరియల్ అయితే 4 వేల ఎపిసోడ్స్ జరిగింది. ఇలా తనకు 14 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టగా గత 13 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా నటిస్తూనే ఉంది. ముఖ్యంగా హాసిని క్యారెక్టర్‌తో ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. ఆమె భర్త సిద్ధార్థ్ వర్మ కూడా నటుడే. ఒకవైపు సీరియల్స్ మరొక వైపు ఫ్యామిలీ లైఫ్ ని సక్సెస్ గా ఎంజాయ్ చేస్తుంది.