‘బ్రహ్మముడి’ సీరియల్ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా…?

Brahmamudi Deepika Rangaraju in telugu: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. బ్రహ్మముడి సీరియల్ లో ఆత్మ గౌరవం ఉన్న అమ్మాయిగా మరియు కుటుంబ బాధ్యతలను మోస్తున్న కావ్య పాత్రలో నటించే దీపిక అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

1996లో పుట్టిన దీపిక చెన్నైలో పెరిగింది. న్యూస్ రీడర్ గా కెరియర్ స్టార్ట్ చేసి..ఆ తర్వాత మోడల్ గా..ఆ తర్వాత నటిగా మారింది. తమిళ చిత్రం ఆరడి (2019)లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తమిళ సీరియల్ ‘చితిరం పెసుతడి’ తో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది.

బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్ ‘బ్రహ్మముడి’. ఈ సీరియల్ లో మానస్, దీపిక రంగరాజు , హమీదా, కిరణ్ కాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీరియల్ చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక ఆదరణ సంపాదించింది.