త్రినయని సీరియల్ నయని రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?

Trinayani Serial Nayani : బుల్లితెర మీద వచ్చే సీరియల్స్ కి మంచి ఆదరణ కన్పిస్తోంది. అందులో భాగంగా వస్తున్న త్రినయని సీరియల్ లో నటిస్తున్న నయని రియల్ లైఫ్ లోకి వెళ్తే, అషికా గోపాల్ పడుకునే. కర్ణాటక లోని ఉడిపిలో 1996జూన్ 29న జన్మించిన ఈమెకు ప్రస్తుతం 25ఏళ్ళు. ఈమె తండ్రి గోపాల్ బ్యాంకు మేనేజర్. తల్లి గృహిణి. అషికాకి ఓ బ్రదర్,ఒక సిస్టర్ ఉన్నారు. ఈమెను త్రినయని,అవని అని కూడా పిలుస్తారు. ఉడిపిలో సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, బెంగుళూరు దయానంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో స్టడీస్ పూర్తిచేసింది. ఇన్ఫోర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుకుంది.
Actress Ashika padukone
కాలేజీ డేస్ నుంచి ఆషికాకు నటన అంటే ఇష్టం. స్టడీస్ కి బ్రేక్ రాకూడదని యాక్టింగ్ కి దూరంగా ఉంది. స్టడీస్ పూర్తయ్యాక కన్నడ బుల్లితెర మీద కెరీర్ స్టార్ట్ చేసింది. నిహారిక సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన ఈమె త్రివేణి సంగమం అనే సీరియల్ లో నటించింది. కథలో రాజకుమారి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది. ప్రస్తుతం జి తెలుగులో వస్తున్న త్రినయని సీరియల్ లో నటిస్తున్నఈమెకు సినిమాల్లో నటించాలనే కోరిక కూడా ఉంది.

అషికాకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టం. హీరోయిన్స్ లో సమంత,కాజల్ అగర్వాల్ అంటే ఇష్టం.గోవా అంటే మక్కువ. ఈమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఈమెకు మణికొండలో 78లక్షల విలువైన ఇల్లు ఉంది. బైక్స్, కార్స్ అంటే ఇష్టం కావడంతో వెస్పా బైక్, ఒక కారు ఉన్నాయి. ఈమె నెట్ వర్త్ 2కోట్లు.ఎపిసోడ్ కి 18వేల వరకూ అందుకుంటుంది. ట్రావెలింగ్, యాక్టింగ్, డాన్సింగ్ అంటే హాబీస్.ఇంట్లో తయారు చేసే ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది.