త్రినయని’ సుమన గురించి నమ్మలేని విషయాలు…మీకు తెలుసా?
Trinayani serial actress sumana:త్రినయని సీరియల్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని 850 కి పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటిస్తున్న అనూష గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. త్రినయని సీరియల్ చూసేవారికి సుమన పాత్ర గురించి బాగా తెలుసు.
ప్రతిరోజు ఆ పాత్రను తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఎత్తులు వేస్తూ ఎవరో ఒకరిని నాశనం చేయాలని అనుకునే పాత్రలో సుమన నటించింది. సుమన పాత్రలో అనూష చాలా అద్భుతంగా నటించింది. వైజాగ్ లో పుట్టి పెరిగిన అనూష 2017లో నటి అవుదామని హైదరాబాద్ వచ్చింది. అయితే సినిమా అవకాశాలు రాకపోవటంతో సీరియల్స్ లో ట్రై చేసింది.
అలా మొదటగా ‘మట్టిగాజులు’ సీరియల్ లో నటించింది. ఆ తర్వాత ‘మీనాక్షి’, ‘లక్ష్మీ కల్యాణం’, ‘చదరంగం’, ‘ఇంటి గుట్టు’..వంటి సీరియల్స్ చేసింది. త్రినయని సీరియల్ లో మాత్రం విలన్ రోల్ మొదటి సారిగా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఈ పాత్రను మొదట శ్రీసత్య చేసింది. అయితే ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో… ఆ అవకాశం అనూషకు వచ్చింది.