ఈ ఫొటోలో మహేష్ బాబు పక్కన ఉన్న ఓ క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood Hero Roshan :సెలబ్రిటీల పిల్లలు చిన్నప్పుడు దిగిన ఫోటోలు పెద్దయ్యాక వైరల్ అయితే గుర్తుపట్టడం కష్టం. సరిగ్గా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఓ చిన్న బాబు నుంచొని ఉన్నాడు. ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. అతడెవరో కాదు, నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్.

తాజాగా పెళ్లి సందడి సినిమా తో రోషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయడం విశేషం. దాంతో మహేష్ తో రోషన్ చిన్నప్పటి ఫోటో ముందుగానే వైరల్ గా మారింది. ఇక కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో రాబోతున్న పెళ్ళిసందడిని మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి శ్రీకాంత్ కి పేరు తెచ్చిన పెళ్ళిసందడి రోషన్ విషయంలో మాత్రం హిట్ ఇవ్వలేక పోయింది.