విగ్గు ఉండాల్సిందే అన్న అక్కినేని… కుదరదు అన్నదర్శకుడు…అసలు ఏమి జరిగింది

Akkineni Nageswara Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండుకళ్లుగా చెప్పుకునే ఇద్దరు అగ్రనటుల్లో అక్కినేని నాగేసవరరావు ఒకరు. దేశంలో అన్ని అత్యున్నత పురస్కారాలు అందుకున్న నట సామ్రాట్ అక్కినేని స్టెప్పులకు కూడా ఆద్యుడు. ఏమీ చదువుకోకపోయినా అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడే అక్కినేని జీవితమే ఓ చరిత్ర. దాదాపు 250సినిమాల్లో నటించిన అక్కినేని అన్ని సినిమాల్లో విగ్గు పెట్టుకుని చేసారు.

కానీ ఓ సినిమాలో మాత్రం యధాతధంగా నటించారు. అదే సీతారామయ్యగారి మనవరాలు. మానస రాసిన నవ్వినా కన్నీళ్లే నవల ఆధారంగా ఈ మూవీ తీశారు. అయితే ఇందులో విగ్గులేకుండా నటించేందుకు అక్కినేని ఒప్పుకోకపోవడంతో ఒకే చేయించడానికి డైరెక్టర్ క్రాంతి కుమార్ చాలా కష్టపడ్డారు.గాంధీ మూవీలో కస్తూర్భా గాంధీ పాత్ర పోషించిన రోహిణి హట్టంగండి సీతారామయ్య గారి మనవరాలు మూవీలో అక్కినేని సరసన అదికూడా తెలుగులో తొలిసారి నటించారు.
Seetharamayya Gari Manavaralu Movie
వి దొరస్వామిరాజు నిర్మించిన ఈ మూవీలో ఇక బాలనటిగా ఇండస్ట్రీలో ఎదిగిన మీనాకు ఈ మూవీ కేరీర్ కి మంచి మలుపు ఇచ్చింది. రిలీజ్ కి ముందు మొదటి భాగంలో 900అడుగులు కట్ చేస్తే బాగుటుందని ప్రివ్యూ చూసిన అక్కినేని సూచించగా, క్రాంతి కుమార్ ఒకే చేసారు. 1991జనవరి 11న ఈమూవీ విడుదలై, అందరికీ నచ్చినప్పటికీ మొదటివారం కలెక్షన్స్ రాలేదు. తర్వాత నుంచి ఊపందుకుని 100రోజులు ఆడింది.

షూటింగ్ సెట్ వేసిన పద్మాలయ స్టూడియోలోనే వందరోజుల వేడుక జరిపారు. చిరంజీవి,నాగార్జున చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సి అశ్వినీ దత్ వంటి ప్రముఖులు వచ్చారు. అప్పట్లో ఈ సినిమాను తన ఇంట్లో అందరికీ అక్కినేని చూపించారు. ఇక విఎంసి అధినేత దొరస్వామిరాజుకి ఇది రెండో సినిమా.