Healthhealth tips in telugu

ఎండుద్రాక్షతో ఇది కలిపి తీసుకుంటే అధిక బరువు తగ్గి శరీరంలో కొవ్వు కరిగిపోతుంది

Raisins and jaggery benefits : అధిక బరువు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిని వేదిస్తుంది. బరువు పెరగటం అనేది చాలా సులువుగా జరిగిపోతుంది. అదే బరువు తగ్గాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే వాటిని ఉదయం సమయంలో తింటే మంచి ఫలితం వస్తుంది.
black raisins
రాత్రి సమయంలో అరగ్లాసు గోరువెచ్చని నీటిలో 4 లేదా 5 ఎండు ద్రాక్షను నానబెట్టాలి. ఉదయం సమయంలో 5 గ్రాముల బెల్లంను తిని, నానిన ఎండుద్రాక్షను తిని ఆ నీటిని తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే బరువు ఖచ్చితంగా తగ్గుతారు. బెల్లం పొడి అయితే నానిన ఎండు ద్రాక్షలో కలిపి తినవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో బెల్లం పొడి కూడా లభ్యం అవుతుంది.
Jaggery Health Benefits in Telugu
మరో విధంగా కూడా తినవచ్చు. 5 ఎండు ద్రాక్షలను మూడు స్పూన్ల పెరుగులో మూడు గంటలు నానబెట్టి భోజనం చేసిన అరగంట తర్వాత తినాలి. బెల్లం,ఎండు ద్రాక్ష రెండూ కూడా బరువు తగ్గించటానికి సహాయపడతాయి. అయితే మోతాదుకి మించి తీసుకుంటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంది. ఎండు ద్రాక్షలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది.
Weight Loss tips in telugu
బెల్లంలో సహజ చక్కెరతో పాటు ఇనుము, పొటాషియం మరియు కాల్షియం వంటి పోషకాలు ఉండుట వలన జీవక్రియను పెంచడానికి మరియు బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే రక్తపోటును తగ్గించడానికి, శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.