Healthhealth tips in telugu

1 స్పూన్ రసం – కోట్లు ఖర్చు పెట్టిన నయం కానీ రోగాలను తేలిగ్గా నయం చేస్తుంది

papaya Leaf Health Benefits In Telugu : బొప్పాయి పండుతో పాటు బొప్పాయి ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి ఆకులలో మన శరీరానికి అవసరమైన ఎన్నో విట‌మిన్లు, పోష‌కాలు ఉంటాయి. బొప్పాయి ఆకులు తినడానికి చేదుగా ఉన్నా ప్రయోజనాలు మాత్రం చాలా ఉన్నాయి. బొప్పాయి ఆకులలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారించే న్యూట్రీషియన్స్ అద్భుతంగా ఉన్నాయి. .
Benefits of Papaya Leaf Juice in Telugu
బొప్పాయి ఆకులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఎ, బి, సి, డి మరియు ఇ, క్యాల్షియంలు సమృద్ధిగా ఉన్నాయి. బొప్పాయి ఆకులను జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అలాగే బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేసుకొని కూడా వాడవచ్చు.

బొప్పాయి ఆకుల జ్యుస్ కాస్త చేదుగా ఉన్నా ఇతర ఫ్రూట్ జ్యూస్ లతో కలిపి తీసుకోవచ్చు. బొప్పాయి ఆకుల రసాన్ని ఇంటిలోనే సులభంగా చేసుకోవచ్చు. ప్రతి రోజు బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవటం వలన మన శరీరంలో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. చాలా మందికి బొప్పాయి పండులో ఉన్న పోషకాల సంగతి తెలుసు. కానీ బొప్పాయి ఆకులో ఉన్న పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు.

అందుకే ఈ రోజు బొప్పాయి ఆకులో ఉన్న పోషకాల గురించి మరియు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. బొప్పాయి ఆకులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇటీవల జరిపిన పరిశోధనలో సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాక్రియాటిక్, లివర్ మరియు లంగ్ క్యాన్సర్ లకు కారణం అయిన వైరస్ కి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యాధి నిరోధక శక్తిని శరీరంలో పెంచటానికి బొప్పాయి ఆకులు బాగా సహాయపడతాయని తేలింది.
papaya Beauty benefits
బొప్పాయి ఆకులో దాదాపు 50 యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా కార్పిన్ అనే ప‌దార్థం. మ‌న శ‌రీరంలో ఫంగస్, వార్మ్స్, పరాన్న జీవులు, ఇతర క్యాన్సర్ సెల్స్ వంటి అతి సూక్ష్మక్రిములు వృద్ధి చెంద‌కుండా నిరోధించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో చాలా బాగా సహాయపడతాయి. తద్వారా శరీరంలో ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి.
Malabaddakam samasya ayurveda chitkalu
బొప్పాయి ఆకులో అమైనో ఆమ్లాలు, ఫినిలాలైన్‌, లైసిన్‌, హిస్టిడైన్‌, టైరోసిన్‌, అలనిన్‌ వంటి ఎంజైమ్స్‌ యాంటీ ఏజింగ్ గా పనిచేస్తాయి. శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ మరియు ప్లేట్ లెట్స్ ను పునరుత్పత్తికి సహాయపడతాయి. బొప్పాయి ఆకులో యాంటీ మలేరియా లక్షణాలు ఉండుట వలన మలేరియాను చాలా సమర్ధవంతంగా నివారిస్తుంది. బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగితే తొందరగా మలేరియా తగ్గుతుంది. డేంగ్యును నివారించడంలో ఒక ట్రెడిషినల్ పద్దతి.
Top 10 iron rich foods iron deficiency In Telugu
బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డేంగ్యూను నివారించవచ్చు. బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ ప్లేట్ లెట్ కౌంట్ ని పెంచటమే కాకుండా బ్లడ్ క్లాట్ కాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా డేంగ్యు వైరస్ కారణంగా లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. బొప్పాయి ఆకుకు బ్లడ్ ప్లేట్ లెట్ కౌంట్ పెంచే సామర్ధ్యం అధికంగా ఉంది.
gas troble home remedies
ప్రతి రోజు రెండు స్పూన్ల బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగితే సహజంగా బ్లడ్ ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. శరీరంలో విషాలను తొలగిస్తుంది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కప్పు వేడి నీటిలో 10 గ్రాముల బొప్పాయి ఆకుల పొడిని వేసి పది నిముషాలు అయ్యాక త్రాగితే జ్వరం తీవ్రత తగ్గుతుంది. అజీర్ణం, గుండెల్లో మంట సమస్యతో బాధపడేవారికి బొప్పాయి ఆకుల్లో ఉంటే ఆమ్లాలు మంచి రిలాక్స్ ని కలిగిస్తాయి.
Pimples,Beauty
బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తూ ఉంటె మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.