ఈ పొడి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ చేసి రక్తనాళాల్లో బ్లాకేజ్ లేకుండా చేస్తుంది

High blood pressure and bad cholesterol Home Remedies In telugu : అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ అనేవి ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. అధిక రక్తపోటు చెడు కొలెస్ట్రాల్ సమస్యలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు సమస్య ఉందని తెలియగానే మందులు వాడాల్సిందే. రక్తపోటు వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. .

అలా మందులు వాడుతూ మనం ఇంటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు కచ్చితంగా ప్రతిరోజు వాకింగ్ చేయాలి. అధిక రక్తపోటు సమస్యను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, మెదడు, గుండె వంటి అవయవాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు కారణంగా ఒత్తిడి., తీవ్రమైన తలనొప్పి, నిద్ర సరిగా రాకపోవడం, చిరాకు వంటి లక్షణాలు కనబడతాయి.

రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి అవిసె గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అందరికీ అందుబాటు ధరలో చాలా విరివిగా లభించే ఈ అవిసె గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అవిసె గింజలను వేసి డ్రై రోస్ట్ చేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. .
cholesterol reduce foods
ఈ పొడి దాదాపుగా పది రోజులు పాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ అవిసె గింజల .పొడి కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. .

ఇలా గోరువెచ్చని నీటిలో కలిపి తాగటం కష్టంగా అనిపిస్తే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కలుపుకొని తినవచ్చు.. లేదంటే సాయంత్రం సమయంలో మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా అవిసె గింజల పొడిని తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. .
Weight Loss tips in telugu
అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు. అలాగే ఈ చలికాలంలో ఎక్కువగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి కూడా చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ పొడిని తయారు చేసుకుని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.