రోడ్డు పక్కన కనిపించే ఈ జిల్లేడు ఆకులో ఉన్న ఆ ప్రయోజనాలు తెలిస్తే…ముఖ్యంగా కీళ్ల నొప్పులు

jilledu Leaf : రోడ్డుకి ఇరువైపుల ఎక్కువగా కనిపించే జిల్లేడు ఆకులను,పువ్వులను ఎక్కువగా వినాయకుని పూజలో ఉపయోగిస్తాం. వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు. పల్లెలో ఉండేవారికి ఇటువంటి మొక్కల గురించి తెలుస్తుంది. జిల్లేడు మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
jilledu
జిల్లేడు చెట్టు నుండి ఆకులు,పువ్వులు సేకరించేటప్పుడు వాటి పాలు కంటిలో పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి విషపూరితం. జిల్లేడు ఆకులను నీరు చేర్చకుండా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ గా చేసి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

అలాగే ఈ ఆకులకు ఆముదం రాసి నొప్పులు ఉన్న ప్రదేశంలో పెట్టి కట్టు కట్టినా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకులను ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవచ్చు. గాయాలు,పుండ్లు అయ్యినప్పుడు ఈ పొడిని రాస్తేతొందరగా తగ్గుతాయి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల కలబంద గుజ్జు,ఒక స్పూన్ పసుపు వేసి పేస్ట్ గా చేయాలి.
jilledu
ఆ తర్వాత తెల్ల జిల్లేడు ఆకు తీసుకుని దానికి నువ్వుల నూనె రాసి కొంచెం వేడి చేయాలి. కీళ్ల నొప్పులు ఉన్న చోట ముందుగా తయారుచేసి పెట్టుకున్న కలబంద గుజ్జు పసుపు మిశ్రమాన్ని రాసి దాని మీద వేడి చేసిన జిల్లేడు ఆకులు వేసి గట్టిగా కట్టు కట్టాలి. ఈ విధంగా రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు శుభ్రం చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.