12 రకాల క్యాన్సర్ లతో సహా 143 వ్యాధులను తరిమికొట్టే ఈ పండు గురించి ఈ నిజాలు తెలుసుకోండి
Health benefits of lakshmana phalam : అనోనేసి కుటుంబానికి చెందిన లక్ష్మణ ఫలంలో సీతాఫలం, రామఫలం వలె కాకుండా పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లక్ష్మణ ఫలాన్ని నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకొని తీసుకోవటం మంచిది. లక్ష్మణ ఫలం ధర కూడా కాస్త ఎక్కవగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో లక్ష్మణ ఫలం గురించి అందరికి తెలిసి వాడటం ప్రారంభించారు.
లక్ష్మణ ఫలంలో పెద్ద ప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, శ్వాసకోస క్యాన్సర్, క్లోమ గ్రంధి క్యాన్సర్ ఇలా 12 రకాల క్యాన్సర్ లను నివారించే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. పెద్ద ప్రేగు క్యాన్సర్ చికిత్సలో వినియోగించే కిమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిర్మూలించగలవని పరిశోధకులు అంటున్నారు.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. లక్ష్మణ ఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్లు సి మరియు ఇ, జింక్ మరియు బీటా కెరోటిన్ ఉండుట వలన కంటి సమస్యలు మరియు కంటి శుక్లం వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కంటి చూపు సమస్యలను కూడా తగ్గిస్తుంది. మూత్రపిండాలు మరియు కాలేయ వ్యాధులను తగ్గించటంలో కూడా లక్ష్మణ ఫలం సహాయపడుతుంది. ఆస్తమా వంటి శ్వాస కోశ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. డిప్రెషన్,ఆందోళన,ఒత్తిడి ఉన్న సమయంలో ఒక లక్ష్మణ ఫలం తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.