Healthhealth tips in telugu

ఫ్రిజ్ లో ఆహార పదార్ధాలను నిల్వ చేస్తున్నారా…రిస్క్ లో పడినట్టే…ఈ నిజం తెలుసుకోండి

fridge storage tips :ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇల్లు లేదు. ఫ్రిజ్ లో కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు, మిగిలిన కూరలు ఇలా అన్ని రకాలు పెట్టేస్తూ ఉంటాం. అయితే ఇవి ఫ్రిజ్ లో ఎన్ని రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చో మీకు తెలుసా? ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.

కోడి గుడ్డు
కోడిగుడ్డు బయట ఉష్ణోగ్రత కన్నా ఫ్రిజ్ లోనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. గుడ్డును ఫ్రిజ్ లో పెడితే రెండు వారాల వరకు నిల్వ ఉంటాయి. అదే ఉడికించిన గుడ్డు అయితే రెండు రోజులు నిల్వ ఉంటాయి. గుడ్లు,చీజ్ వంటి వాటిని 5 నుంచి 8 డిగ్రీల వద్ద ఉంచాలి

ఆకుకూరలు
ఆకుకూరలు కేవలం రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆకుకూరలు,కూరగాయలు,పండ్ల వంటి వాటిని ప్రత్యేక అరలో 8 నుంచి 10 డిగ్రీల మధ్యలో ఉంచాలి.

పాలు మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఆలా కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పాలను ఒక బాటిల్ లో పోసి ఫ్రీజింగ్ చేయాలి. అప్పుడు పాలు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. పాల ఉత్పత్తులను 4 డిగ్రీల వద్ద ఉంచాలి.
weight loss tips in telugu
పెరుగు,చీజ్ వంటివి నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి. వండిన కూరలు ఫ్రిజ్ లో పెడితే నాలుగు రోజుల పాటు తినవచ్చని అనుకుంటారు. కానీ ఒక్క రోజు మించి ఉంచకూడదు. ఒక్క రోజు మించితే ఆరోగ్యానికి మంచిది కాదు.

పండ్లను ఫ్రిజ్ లో పెడితే చాలా రోజులు నిల్వ ఉంటాయని అందరు భావిస్తారు. కానీ పండ్లు నిల్వ ఉండటానికి కూడా ఒక పరిమితి ఉంది. ఆపిల్ వంటి పండ్లు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. నిమ్మ జాతి పండ్లు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.

టమోటాలను ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పగిలిన చోట సాల్మొనెల్లా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందువల్ల టమోటాలను వారం రోజుల్లోనే వాడుకోవాలి. మాంసం ను ఫ్రిజ్ లో నిల్వ చేసినప్పుడు ప్రతి అరగంటకు బ్యాక్టీరియా రెట్టింపు వృద్ధి చెందుతుంది. చేపలు,రొయ్యలు వంటి వాటిని డిప్రిజర్,చిల్లర్ లో భద్రపరచడం వలన వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.