Healthhealth tips in telugu

ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా… రిస్క్ లో పడినట్టే…ఇది నమ్మలేని నిజం

phone early in the morning : ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.స్మార్ట్ ఫోన్లు లేని వారు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా యాప్స్, గేమ్స్ యాప్స్ రావటంతో స్మార్ట్ ఫోన్ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది. ఈ రోజుల్లో లో సగం పైగా సమయాన్ని ఫోన్లోనే గడిపేస్తున్నారు చాలామంది.

ఉదయం లేవగానే ముందు ఫోన్ పట్టుకుంటారు. ఫోన్ చూశాకనే మంచం దిగుతారు. అంతలా ఫోన్ కి అలవాటు పడిపోయారు. అలా ఉదయం లేవగానే ఫోన్ చూడటం ప్రమాదమని, అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూడ‌టం వ‌ల్ల‌.అప్ప‌టి వ‌ర‌కు విశ్రాంతి తీసుకున్న కళ్లపై ఒక్కసారిగా ఎక్కువ కాంతి పడుతుంది.ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే కంటికి తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి.
phone early in the morning
అలాగే ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూడ‌టం వ‌ల్ల ర‌క్త‌పోటు వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంది. ఎందుకంటే ఫోన్ లో మంచి వార్తలు,చెడు వార్తలు ఉండవచ్చు. చెడు వార్తలు చూసినట్టు అయితే వాటిని చూడ‌గానే మెద‌డుపై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌టంతో పాటు ర‌క్త‌పోటు పెర‌గ‌డ‌మో.త‌గ్గిపోవ‌డ‌మో జ‌రుగుతుంది.అలా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తే. ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.