Beauty Tips

వారంలో 2 సార్లు ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య,చుండ్రు లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Hair Fall Tips In Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య ఉంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలామంది కంగారు పడిపోతారు. అలా కంగారుపడి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. .
usiri benefits in telugu
అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే మన ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నిస్తే కచ్చితంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మెంతులను పొడిగా చేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ మెంతి పిండి, ఒక స్పూన్ వేప పొడి, ఒక స్పూన్ ఉసిరి పొడి, మూడు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి.
fenugreek seeds
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. .

ఇందులో ఉండే కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్, యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు సమస్య లేకుండా చేస్తాయి. తలమీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాక జుట్టు మృదువుగా కాంతివంతంగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/