హైబీపీతో బాధపడేవారు ఈ పండ్లను తింటే జీవితంలో అధిక రక్తపోటు అనేది ఉండదు
High Bp Reduced Fruits : ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో అధిక రక్తపోటు సమస్య. అధిక రక్తపోటు అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా మందులను వాడాలి. ఒక్కసారి బీపీ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. అలా మందులు వాడుతూ కొన్ని పండ్లను తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఎర్రని రంగులో తీపి పులుపు రుచితో ఉండే స్ట్రాబెర్రీ రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఆంథోసైనిన్, విటమిన్ సి, పొటాషియం ,ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు రక్తపోటును నియంత్రించటానికి సహాయపడతాయి. రోజుకి రెండు లేదా మూడు స్ట్రా బెర్రీలను తింటే సరిపోతుంది.
దానిమ్మ కూడా రక్తపోటు నియంత్రణలో బాగా సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక దానిమ్మ కాయ గింజలను తింటే దానిమ్మలో ఉండే ACE అనే ఎంజైమ్ రక్త ప్రవాహం నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వేసవిలో ఉండే రక్తపోటు హెచ్చుతగ్గులు కూడా ఉండవు. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మామిడి పండు రక్తపోటు నియంత్రణలో బాగా సహాయపడుతుంది. వేసవిలో ఎక్కువగా లభ్యం అయ్యే మామిడి పండులో ఫైబర్, బీటా కెరోటిన్ ,పొటాషియం అధికంగా ఉండుట వలన రక్తపోటు హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉండేలా చేస్తుంది. రక్తపోటు సమస్య ఉన్నప్పుడూ మందులు వాడుతూ ఇలా రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/