Healthhealth tips in telugu

పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

piles Home Remedies In telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు,నీరు తక్కువగా తాగటం,మలబద్దకం సమస్య,ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది.
piles home remedies
ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.

గుప్పెడు గోరింటాకు శుభ్రంగా కడగాలి. రెండు వక్కలను తీసుకొని మెత్తని పొడిగా చేయాలి. మిక్సీ జార్ లో గోరింటాకు,వక్కల పొడి,ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంపై రాసి పావుగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తూ ఉండాలి.
Piles Fruits
అలా చేస్తూ ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించాలి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/