Beauty Tips

రాత్రి ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది

Best skin whitening night cream : ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక చాలా నిరాశ చెందుతారు.
Carrot
ఈ చిట్కా ఫాలో అయితే అసలు నిరాశ చెందకుండా ముఖం తెల్లగా మెరిసిపోవటం ఖాయం. దీని కోసం కలబందలోని జెల్ తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసి వడకట్టి జెల్ తీయాలి. ఈ జెల్ ని పది నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత చిన్న క్యారెట్ తీసుకొని పైతొక్క తీసి తురిమి మిక్సీలో వేసి జ్యూస్ గా తయారుచేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేసి క్రీమ్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. ఈ క్రీమ్ లో ఆలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకొనే ముందు ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ముఖాన్ని సబ్బుతో రుద్దకూడదు. మరుసటి రోజు ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవచ్చు.

క్యారెట్ లో ఉన్న విటమిన్ A చర్మం మీద మచ్చలు,మొటిమలు లేకుండా చేస్తుంది. ఆలోవెరా ముఖం మీద మృత కణాలను తొలగిస్తుంది. ఈ క్రీమ్ ని రాత్రి సమయంలో మాత్రమే రాయాలి. ఈ వేసవిలో ముఖానికి చల్లదనాన్ని ఇస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/